దేశవ్యాప్తంగా పోలీసుల కొరత

Date:04/07/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

తెలంగాణలో 30వేలు, ఆంధ్రప్రదేశ్‌లో 17వేల పోలీసుల కొరత ఉందని కేంద్రం రాజ్యసభలో ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 5.42 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. దేశవ్యాప్తంగా 24.84 లక్షల పోలీసు పోస్టులకు గాను 19.41 లక్షల మందే ఉన్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో 76,407 మంది పోలీసులు అవసరం కాగా ప్రస్తుతం 46,062 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. యూపీ, బిహార్, పశ్చిమ బెంగాల్ తర్వాత పోలీసు పోస్టులు అధికంగా ఖాళీ ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో 72,176 మంది పోలీసులు అవసరం కాగా.. ప్రస్తుతం 54,243 మంది ఉన్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. పోలీసుల నియామకం అంతా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటుందని, అందువల్ల ఆయా ఖాళీలను భర్తీతో కేంద్రానికి సంబంధం లేదని పేర్కొన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు పోస్టులను వెంటనే భర్తీ చేసుకోవాలని సూచించారు.

 

మళ్లీ కర్ణాటక ఎమ్మెల్యేల రిసార్ట్స్ బాట

Tags: Shortage of police throughout the country

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *