హైదరాబాద్ లో సిరంజీల కొరత

హైదరాబాద్    ముచ్చట్లు:

నిన్నమొన్నటి దాకా టీకాల కొరతతో వ్యాక్సినేషన్ నిలిచిపోయేది. ఇప్పుడు వ్యాక్సిన్ ఉన్నా సిరంజీల కొరత ఏర్పడింది. వ్యాక్సిన్ వేయించుకునే వారే బయటి నుంచి సిరంజీలు తెచ్చుకుందామన్నా దొరకని పరిస్థితి. దీంతో వ్యాక్సినేషన్ మధ్యలోనే ఆగిపోయింది. దీనిపై హెల్త్, జీహెచ్ఎంసీ ఆఫీసర్లు ఒకరిపై ఇంకొకరు విమర్శలు చేసుకున్నారు. సిరంజీలు లేవన్న విషయం బల్దియా ఆఫీసర్లకు ముందే  చెప్పామని జిల్లా వైద్యాధికారులు అంటే.. తాము మాత్రం సిరంజీలు ఎక్కడి నుంచి తెస్తామని, అది తమ పని కాదంటూ బల్దియా అధికారులు మండిపడుతున్నారు. అధికారుల మధ్య కోఆర్డినేషన్ లేకపోతే జనానికి వ్యాక్సిన్ ఎలా అందిస్తారని టీకాల కోసం వచ్చిన వాళ్లు నిలదీస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 60 సెంటర్ల ద్వారా రిస్క్ టేకర్స్ కేటగిరీ వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. ఒక్కో సెంటర్ లో డైలీ 1,500 మందికి టీకా వేస్తున్నామని ఆఫీసర్లు  చెబుతున్నారు. కానీ ఇందుకు సరిగ్గా ఏర్పాట్లు చేయలేదు. సిరంజీలు లేకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. చంపాపేట్లో ఉదయం ప్రారంభమైన వ్యాక్సినేషన్.. సిరంజీలు లేకపోవడంతో కొద్దిసేపటికే నిలిచిపోయింది. సిరంజీలు లేవని, బయటి నుంచి తెచ్చుకోవాలని హెల్త్ స్టాఫ్ సూచించారు. దీంతో క్యూలైన్లలో నిలుచున్న జనం మెడికల్ షాపులకు వెళ్లారు. కానీ కొందరికే దొరికాయి. చంపాపేట్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మెడికల్ దుకాణాల్లో సిరంజీలు మొత్తం అప్పటికే ఖాళీ అయ్యాయి. దీంతో చాలా మందికి దొరకలేదు. దీనిపై అధికారులను జనం ప్రశ్నించడంతో రేపు రావాలంటూ కొద్దిసేపటికే ఆపేశారు. ఈ సెంటర్లో వ్యాక్సిన్ కోసం ఒకరోజు ముందే 1,200 మంది రిజిస్ర్టేషన్ చేసుకోగా.. 723 మందికి వేశారు. మిగతా వారిని తిప్పి పంపారు.తమకు వ్యాక్సిన్ వేయకపోవడంపై స్వయం సహాయక బృందాల మహిళలు మండిపడ్డారు. ‘‘ఉదయం 11 గంటలకు వచ్చినం. సిరంజీలు లేవని, కొనుక్కొచ్చుకోవాలని చెప్పిన్రు. సిరంజీలు తెచ్చుకున్నా వ్యాక్సిన్ వేయడం లేదు” అంటూ వాపోయారు. పనులు, ఉద్యోగాలను వదిలి వ్యాక్సిన్ కోసం వస్తే ఇలా చేస్తారా అంటూ అధికారులపై ఫైర్ అయ్యారు. వ్యాక్సిన్ వేస్తున్నామని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం మానుకుని ఏర్పాట్లు సరిగ్గా చేయాలని అన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:Shortage of syringes in Hyderabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *