Natyam ad

సైబర్‌ నేరాలపై అవగాహన ఉండాలి

పుంగనూరు ముచ్చట్లు:

ప్రస్తుతం సమాజంలో సైబర్‌ నేరాలు తీవ్రమైందని వాటిపై అవగాహన పెంచుకోవాలని , ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ సూచించారు. బుధవారం శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇండియన్‌ బ్యాంక్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ షాహీద్‌ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి సురక్ష భీమాయోజన , సైబర్‌ మోసాలు, అటల్‌పెన్షన్‌, సుకన్య సంవృద్ధి పథకాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించి, పోస్టర్లు విడుదల చేశారు. శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగి వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సైబర్‌ నేరాలు తీవ్రమైందని, లింకులు ఓపెన్‌ చేస్తే మనకు తెలియకనే మన ఖాతాలలో డబ్బులు మాయమౌతోందని తెలిపారు. లింకులను ఓపెన్‌ చేయరాదని , మోసం జరిగిన వెంటనే 1930 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అద్యాపకులు రాజశేఖర్‌, సిబ్బంది మహమ్మద్‌, నూరాలి, రబ్బాని తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Should be aware of cyber crimes

Post Midle