గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాలి…

హైదరాబాద్  ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని తెలంగాణకు చెందిన ట్రైబల్ యూనివర్సిటీని వెంటనే ఈ విద్యాసంవత్సరం ప్రారంభించాలని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో గిరిజన శక్తి, టి ఐ ఎఫ్, ఎల్ ఎస్ ఓ,గిరిజన చైతన్య వేదిక మరియు ఇతర గిరిజన సంఘాల తో కలిసి శరత్ నాయక్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ ప్రో.సీతారాం నాయక్,జాతీయ అధ్యక్షులు బెల్లయ్య నాయక్, మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం  గిరిజన యూనివర్సిటీ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నిన్న 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నా రాష్ట్ర ప్రభుత్వం వాటిల్లో గిరిజన విద్యార్థుల నష్టం జరగకుండా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించిన తర్వాత నోటిఫికేషన్లు జారీ చేయాలని పేర్కొన్నారు.
 
Tags:Should start a tribal university

Leave A Reply

Your email address will not be published.