Natyam ad

పుంగనూరులో జెండ కట్టి దేశభక్తిని చాటండి – మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

భారతావనికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు కావస్తున్న తరుణంలో హర్‌గర్‌ తిరంగా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు నిర్వహించి, దేశభక్తిని చాటాలని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని సుగాలిమిట్టలో ఎంపీ రెడ్డెప్పతో కలసి జాతీయ పతాకాన్ని పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ ఆజాదీకా అమృత్‌ మహ్గత్సవ్‌లో భాగంగా ప్రతి ఒక్కరు తమ ఇండ్లపై జెండాలను ఎగురవేయాలన్నారు. ఈ మేరకు ప్రభుత్వం సచివాలయాల ద్వారా జెండాలను పంపిణీ కార్యక్రమం విస్తతంగా చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, జెడ్పిటిసి జ్ఞానప్రసన్న, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఈశ్వరమ్మ, సరోజమ్మ, పార్టీ నాయకులు జయరామిరెడ్డి, దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, నరసింహులు, అమరనాథరెడ్డి, రామకృష్ణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, రాజునాయక్‌, ప్రభాకర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Show patriotism by hoisting the flag in Punganur – Minister Peddireddy Ramachandra Reddy

Post Midle

Leave A Reply

Your email address will not be published.