showage-notices-to-assistant-secretary-of-education

ఉధ్యానవనశాఖ సహాయ కార్యదర్శికి షోకాజ్‌ నోటీస్‌

Date:02/07/2020

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని వనమలదిన్నె సచివాలయంలో హర్టికల్చర్‌ సహాయ కార్యదర్శి డి. వెంకట్రమణకు షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లు గురువారం ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యంతో పాటు సచివాలయ పరిధిలోని రైతులకు రైతు భరోసా, తదితర పథకాలను అందించకపోవడం, ప్రతి ఒక్కరితోను దురుసుగా ప్రవర్తిస్తున్నాడని వెంకట్రమణపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపి షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు ప్రజలు, సంబంధిత అధికారులతో మర్యాదగా నడుచుకోవాలని, ప్రభుత్వ పథకాలను అందించేందుకు కృషి చేయాలని ఎంపీడీవో తెలిపారు. ఇందుకు విరుద్దంగా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వాలంటీర్ ఆత్మహత్యాయత్నంపై విచారణ

Tags: Showage notices to Assistant Secretary of Education

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *