పుంగనూరులో వైభవంగా శ్రావణ శుక్రవార పూజలు
పుంగనూరు ముచ్చట్లు:
శ్రావణ శుక్రవార సందర్భంగా శుక్రవారం పట్టణంలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీవిరూపాక్షి మారెమ్మ ఆలయంలో అమ్మవారికి కరెన్సీ నోట్ల హారం వేసి ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. కోనేటి వద్ద గల శ్రీ అష్టలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే తూర్పు వెహోగశాలలో గల శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి, పార్వతిదేవికి ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అలాగే మహిళలు తమ ఇండ్లలో అమ్మవార్లను ఉంచి ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags: Shravan Friday Pujas in Punganur
