Shravan Kumar as BJP town president

బిజెపి పట్టణ అధ్యక్షుడుగా శ్రావణ్‌కుమార్‌

Date:10/12/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణ బిజెపి అధ్యక్షుడుగా శ్రవణ్‌కుమార్‌ను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఎన్నికల అధికారి ప్రవీన్‌కుమార్‌ , పట్టణ సీనియర్‌ నాయకులు, బూత్‌ కమిటి అధ్యక్షులు , క్రీయాశీలక సభ్యుల ద్వారా ఈ కార్యక్రమానికి హాజరైన రాజాజెట్టి, గణేష్‌, రాజారెడ్డి, అయూబ్‌, లోకేష్‌ ఆధ్వర్య ఈ నియామకాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్‌ నాయకుడు రాజాజెట్టి మాట్లాడుతూ పట్టణ అధ్యక్షుడుగా శ్రవణ్‌కుమార్‌ను ఏక గ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈయన ఆధ్వర్యంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. శ్రవణ్‌కుమార్‌ మాట్లాడుతూ పార్టీ కోసం , ప్రజల కోసం ఆహర్నిశలు శ్రమిస్తూ, పార్టీలో నాకు స్థానం కల్పించి, నన్ను ఏకగ్రీవంగా ఎంపిక చేసిన ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు హరిబాబు, ప్రవీన్‌కుమార్‌, భక్తవత్సలం, బాబు, పురుషోత్తం, ఫరుల్‌ఖాన్‌, ప్రసాద్‌, బార్గవ్‌, ఫృద్వీ, చిన్న, కార్తీక్‌, వినోద్‌, శీన తదితరులు పాల్గొన్నారు.

 

బూందీ పోటులో అగ్నిప్ర‌మాదాల నివారణ‌కు చ‌ర్య‌లు

 

Tags:Shravan Kumar as BJP town president

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *