ఆలయాలకు శ్రావణ మాసశోభ

విశాఖపట్నం ముచ్చట్లు:


విశాఖలో ప్రముఖ అమ్మ వారి దేవాలయా లు శ్రావణమాస శోభతో తొనికిసలాడుతున్నాయి. శ్రావ ణమాసం తొలి శుక్రవారం నుంచి ప్రతీ వారం అమ్మవా రికి ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి.మూడో శుక్రవారం సందర్బంగా పెద్దసంఖ్యలో అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.భక్తుల తో ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిసిం ది.క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడా యి.శ్రావణ మాసం మొదటి వారం నుండే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించుకొని అమ్మవారి దర్శనానికి భక్తులు వస్తు న్నారు.ఉత్తరాంధ్ర భక్తుల ఆరాద్యదై వం శ్రీకనకమ హాలక్ష్మీ అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చి కుంకుమపూజలు చేశారు. శ్రావణ మాసాన్ని ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు.మహిళలు ఈ మాసం అత్యంత శుభ ప్రదమైనదిగా భావించి వ్రతాలు నోచుకుని,అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మ వారి కృపకు పాత్రులవుతున్నారు.

 

Tags: Shravan month is auspicious for temples

Leave A Reply

Your email address will not be published.