Shravanam Full Moon Garudaseva at Thirumala Srivari Temple

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో శ్రావ‌ణ‌ పౌర్ణమి గరుడసేవ

Date:03/08/2020

తిరుమల ముచ్చట్లు:

తిరుమలలో సోమ‌వారం సాయంత్రం శ్రావ‌ణ పౌర్ణమి గరుడసేవ జరిగింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.  ఇందులో భాగంగా  సాయంత్రం 5.00 నుండి 6.00 గంట‌ల వ‌ర‌కు తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌క మండ‌పంలో సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు త‌న‌కు ఎంతో ప్రీతిపాత్ర‌మైన గరుడ వాహ‌నాన్ని అధిరోహించారు.    క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా గ‌రుడ వాహ‌న సేవ‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.  ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, సివిఎస్వో  ‌ గోపినాధ్ జెట్టి, విజివో   మ‌నోహ‌ర్‌, ఇత‌ర‌ అధికారులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Tags: Shravanam Full Moon Garudaseva at Thirumala Srivari Temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *