Natyam ad

శ్రీ బాలాజీ గ్రీన్ సిటీ నూతన వెంచర్ బ్రోచర్ ఆవిష్కరణ-సందడి చేసిన జబర్దస్త్ ఆది బృందం

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరిగొండ గ్రామంలో 18 ఎకరాల ఏడు సెంట్ల విస్తీర్ణంలో నిర్వాహకులు ఏర్పాటు చేయబడిన శ్రీ బాలాజీ గ్రీన్ సిటీ ప్రాంగణంలో ఆదివారం శ్రీ బాలాజీ గ్రీన్ సిటీ నూతన వెంచర్ బ్రోచర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భువనేష్ లైఫ్ స్పేసెస్ అధినేత కాకు బాబురావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గెనేడి వెంకటేశ్వర్లు నాయుడు, కాకు బాబురావుల ఆధ్వర్యంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న బాబిరెడ్డి  చేతుల మీదుగా శ్రీ బాలాజీ గ్రీన్ సిటీ నూతన వెంచర్  ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ సందర్భంగా ముఖ్య అతిధి బాబి రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి అందాలు, ప్రశాంతకు మారుపేరుగా ఆహ్లాదకరమైన వాతావరణంలో “శ్రీ బాలాజీ గ్రీన్ సిటీ” నూతన వెంచర్ సొంత ఇంటి కల లక్ష్యం గల వారందరికీ ఒక వరంగా మారునందన్నారు. నెల్లూరు కార్పొరేషన్ కు 9కిలోమీటర్ల దూరంలో కాకుపల్లి గ్రామం నుండి తోటపల్లి గూడూరుకి వెళ్లే దారిలో వరిగొండ గ్రామం నందు, శ్రీ జ్వాలాముఖి అమ్మవారి సన్నిధిలో, రామాలయం మరియు శివాలయంకు అతి సమీపంలో, సహస్ర ఫార్మా సూటికల్స్ కళాశాలకు  దగ్గరగా, కృష్ణపట్నం పోర్టుకు అతి సమీపంలో  200 అడుగుల ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఏర్పాటు చేయబడిన శ్రీ బాలాజీ గ్రీన్ సిటీ 18 ఎకరాల 7 సెంట్లలో నుడా అప్రూవల్ లేఔట్ సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలని లక్ష్యంతో ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతో అనువుగా వెంచర్ ఏర్పాటు చేయబడిందన్నారు.

 

 

 

శ్రీ బాలాజీ గ్రీన్ సిటీ నుడా అప్రూవల్ లేఔట్ కలిగి 100 శాతం క్లియర్ టైటిల్ మరియు బ్యాంకు లీగల్ అడ్వైజర్ నుండి లీగల్ ఒపీనియన్ తీసుకోని వెంచర్ను ఏర్పాటు చేయబడిందని చెప్పారు. ల్యాండ్ కన్వెన్షన్ లో రెవెన్యూ వారిచే నూటికి నూరు శాతం ఆమోదంతో పాటు, ఫ్లాట్లు కొన్న వెంటనే  కట్టుకునే  విధంగా, వాస్తు రీత్యా ఎటువంటి ఇబ్బందులు లేకుండా శ్రీ బాలాజీ గ్రీన్ సిటీ నేలకల్పబడిందని తెలిపారు. శ్రీ బాలాజీ గ్రీన్ సిటీ లో 40 అడుగుల వెడల్పు గల సిసి రోడ్లతో పాటు లేఅవుట్ మొత్తం ఎటువంటి అవాంతరం లేని కరెంట్ సౌకర్యం ఉంటుందన్నారు. 30 అడుగుల లోతులో మంచినీటి సౌకర్యం కలిగిన భూమిలో శ్రీ బాలాజీ గ్రీన్ సిటీ ఏర్పాటు కావడం ఎంతో హర్షణీయమన్నారు. ముఖ్యంగా వినియోగదారులకు గృహస్థులకు 24 గంటలు బస్సు సౌకర్యంతో పాటు ఆటో సౌకర్యం నిరంతరం ఉంటుందని తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేయబడిన శ్రీ బాలాజీ గ్రీన్ సిటీ వెంచర్ లో రోడ్డుకి ఇరువైపులా చెట్లు మరియు ట్రీ గార్డ్స్ లేఅవుట్ ఎంట్రెన్స్ నందు ఆర్చి మరియు

 

 

 

 

Post Midle

గేట్ తో పాటు లేఅవుట్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించి, డ్రైనేజీ సౌకర్యం కల్పించడమే  లక్ష్యంగా శ్రీ బాలాజీ గ్రీన్ సిటీ నిర్వాహకులు తగిన ఏర్పాటు చేస్తున్నారని తెలియజేశారు. ప్లాట్లు కొనుగోలుదారులకు ప్రభుత్వ, ప్రవేట్  బ్యాంకుల నుండి లోన్లు పొందేందుకు మరింత సౌకర్యాన్ని శ్రీ బాలాజీ గ్రీన్ సిటీ కలుగజేస్తుందన్నారు. ఈ సందర్భంగా కస్టమర్లకు రియల్ ఎస్టేట్ ఏజెంట్ మిత్రులకు స్థానికులకు  ఉత్సాహభరితమైన ఆనందాన్ని కలిగించేందుకు జబర్దస్త్ హైపర్ “ఆది” బృందంచే  పాటలు మరియు నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా వెంచర్ నిర్వాహకులు జి.వెంకటేశ్వర్ల నాయుడు, కాకు బాబురావు నూతనంగా ఏర్పాటు చేయబడిన శ్రీ బాలాజీ గ్రీన్ సిటీ వెంచర్ లో ప్లాట్ కొనుగోడుదారులకు ఏర్పాటు చేయబడిన ఆధునిక సదుపాయాల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కేశవ గౌడ్ మాజీ సర్పంచ్ ఈశ్వరయ్య , రియల్ ఎస్టేట్ ప్రతినిధులు మాలకొండ రెడ్డి ,సునీల్ రెడ్డి లతోపాటు సుందరయ్య నాయుడు ,నూతన ప్రతాపరెడ్డి ,కేశవ గౌడ్ ,శంకర్ గౌడ్, కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Shree Balaji Green City New Venture Brochure Inaugurated- Jabardasth Aadi Team

Post Midle