శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల గోడ‌ప‌త్రిక‌లు ఆవిష్క‌ర‌ణ‌

Date:08/11/2019

తిరుపతి ముచ్చట్లు:

టిటిడికి అనుబంధంగా ఉన్న‌ నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల గోడ‌ప‌త్రిక‌ల‌ను జెఈవో పి.బసంత్‌కుమార్ శుక్ర‌వారం తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో ఆవిష్క‌రించారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలిసి తెలియక దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. న‌వంబ‌రు 22న సాయంత్రం సేనాధిప‌తి ఉత్స‌వం, అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది. న‌వంబ‌రు 23న ఉదయం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ, సాయంత్రం వీధి ఉత్సవం, రాత్రి పూర్ణాహుతి నిర్వ‌హిస్తారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ప్ర‌త్యేక ఆహ్వానితులు శ్రీ గోవింద హ‌రి, ఆల‌య డెప్యూటీ ఈవో శాంతి, డిఈవో డా. ర‌మ‌ణ‌ప్ర‌సాద్‌, సూప‌రింటెండెంట్  చంద్ర‌మౌళీశ్వ‌ర‌శ‌ర్మ‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

డిసెంబర్‌ 6న ‘పానిపట్‌’ చిత్రం విడుదల

 

Tags:Shree Vedanarayanaswamy Temple wallpapers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *