Natyam ad

శ్రీ లలితా దేవి అలంకారం లొ శ్రీ   అంబా భవాని దేవి  

కడప ముచ్చట్లు:

 

కడప నగరంలోని భవాని నగరంలోని శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరంలోని బిల్టప్  దగ్గరలో  భవాని నగర్ లో వెలసిన  శ్రీ అంబ భవాని ఆలయం మహారాష్ట్ర మఠం కమిటీ ఆధ్వర్యంలో  శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్ర వారం అంబా భవాని దేవి శ్రీ లలితా దేవి అలంకారం లొ భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారికి  రుద్రాభిషేకం మహా మంగళహారతి ప్రసాద వినియోగం  సహస్రనామార్చన మంత్రపుష్పం దశ హారతి మంగళహారతి ప్రసాద వినియోగం జరిగింది ఈ పూజలలో జిల్లా అగ్ని మాపక శాఖ అధికారి బి వి యస్ రామ్ ప్రకాష్  పాల్గొని పూజలు చేసారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మహారాష్ట్ర మఠం కమిటీ చైర్మన్ రామ్ గణేష్రావు, వైస్ చైర్మన్ శ్రీనివాస రావు, కోఆర్డినేటర్ రవి శంకర్ రావు, సెక్రెటరీ చవాన్ నాగార్జున రావు,

 

 

 

జాయింట్ సెక్రెటరీ సి  రఘు శంకర్రావు  ట్రెజరర్ర్ వై శివనాధరావు లు మాట్లాడుతూ అంబా భవాని ఆలయం వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన పురాతన ఆలయం అని తెలిపారు  ఆలయంలో శమీ వృక్షం ఉన్నదని అప్పటినుండి అమ్మవారి శమీ దర్శనం కలదని తెలిపారు .వేప చెట్టు రావి  చెట్టు గుడి వెలసిన ప్పటి నుండి ఉన్నటువంటి చరిత్ర కలిగిన భవాని ఆలయం అని తెలిపారు నవరాత్రుల్లో  ప్రతి రోజు ప్రత్యేక అలంకారం తో అంబా భవాని భక్తులకు దర్శనమిస్తున్నదని తెలిపారు ఉత్సవాలలో నగర ప్రజలు భక్తులు విరివిగా హాజరై అంబా భవాని అనుగ్రహం పొందాలని కోరారు  ఈ8 కార్యక్రమంలో  మరాఠ  మండల సంఘం  కమిటీ సభ్యులు, మహారాష్ట్ర మఠం కమిటీ సభ్యులు, భక్తులు  విరివిగా పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందారు.

 

Post Midle

Tags: Shri Amba Bhavani Devi in Sri Lalita Devi Alankaram

Post Midle

Leave A Reply

Your email address will not be published.