Natyam ad

స్వర్ణరథంపై శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామి కటాక్షం

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండవరోజైన సోమవారం ఉదయం శ్రీ మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమాడ వీధుల్లో స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు.ఇందులో భాగంగా ఉదయం 8 నుండి 10 గంటల నడుమ అత్యంత వైభవంగా సాగిన స్వర్ణరథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని గోవిందనామాలు జపిస్తూ రథాన్ని లాగారు.స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ, భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భక్తుల విశ్వాసం.ఈ కార్యక్రమంలో ఈవో  ఏవి ధర్మారెడ్డి దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో  లోకనాథం, విజివో  నంద కిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:Shri Bhu Sametha Shri Malayappaswamy Kataksham on the Golden Chariot

Post Midle