శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు

Shri Govindarajaswamy Temple Temples

Shri Govindarajaswamy Temple Temples

Date:25/08/2019

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 9 నుండి 11వ తేదీ వరకు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. సెప్టెంబరు 8న సాయంత్రం రుత్విక్‌వరణం, మ త్సంగ్రాహణం, పుణ్యాహవచనం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా సెప్టెంబరు 9న ఉదయం పవిత్రప్రతిష్ఠ,  సాయంత్రం  యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సెప్టెంబరు 10న మూలవర్లకు, ఉత్సవర్లకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి, మాడ వీధుల్లోని శ్రీమఠం ఆంజనేయస్వామి వారికి పవిత్రాలు సమర్పించనున్నారు.  సెప్టెంబరు 11న పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి.

 

 

 

ఈ మూడు రోజుల పాటు ఉదయం  శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ విందరాజస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, సాయంత్రం స్వామి, అమ్మవార్లు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.  రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. గృహస్తులకు చివరిరోజు పవిత్రమాలను బహుమానంగా అందజేస్తారు.

సచివాలయ ఉద్యోగుల అభ్యర్థులకు అవగాహన సదస్సు

Tags: Shri Govindarajaswamy Temple Temples

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *