చిన్నశేషవాహనంపై శ్రీ మలయప్ప చిద్విలాసం
తిరుమల ముచ్చట్లు:
తిరుమలలో శనివారంనాడు ‘రథసప్తమి’ ఉత్సవం సందర్భంగా రెండో వాహనమైన చిన్నశేష వాహనసేవ ఘనంగా జరిగింది.చిన్నశేష వాహనం – కుటుంబ శ్రేయస్సు (ఉదయం 9 గం||ల నుండి 10 గం||ల వరకు) :సూర్యప్రభ వాహనంపై శ్రీసూర్యనారాయణమూర్తి కమనీయ రూపాన్ని తిలకించి పులకించిన భక్తులు అనంతరం స్వామివారి చిద్విలాసాన్ని చిన్నశేష వాహనంపై తిలకించి తరించారు.పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగలోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయస్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.జెఈఓలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, ఎఫ్ఏసిఏఓ బాలాజి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఆలయ డెప్యూటీ ఈఓ రమేష్ బాబు ఇతర టిటిడి అధికారులు ఈ వాహన సేవలో పాల్గొన్నారు.

Tags:Shri Malayappa Chidvilasam on Chinnaseshavahanam
