శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 జయంతి వేడుకలు

చిత్తూరు ముచ్చట్లు:
 
శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 జయంతి వేడుకలను నేడు యోగా అసోసియేషన్ మీటింగ్ హాల్ యందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ‘నెహ్రూ యువ కేంద్ర’ చిత్తూరు, మరియు ‘యోగా అసోసియేషన్ ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్’ వారి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా  . యం. వెంకట్రామి రెడ్డి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, తిరుమల. వారు విచ్చేసి నేతాజీ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం నేటి తరానికి ఒక ఆదర్శం అని, ఉన్నత విద్యను అభ్యసించి, ఉన్నత ఉద్యోగాన్ని సంపాదించి కూడా దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారి పై పోరాటం చేసారు. ‘ అజాద్ హిందూఫౌజ్’ స్థాపించి బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసారు . తన స్వార్ధం కోసం కాకుండా, దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వీరుడు నేతాజీ అని తెలిపారు.యోగా అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శి యస్. శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ, క్రమశిక్షణ, పట్టుదల, కార్యదీక్ష నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆభరణాలు అని, అందుకే అయన నేటి యువతకు ఆదర్శం అయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా వ్యక్తుత్వ పోటీలు నిర్వాహచడం జరిగింది. ఈ పోటీలో పాల్గొని చక్కగా సుభాష్ చంద్ర బోస్ గారి గురించి అనర్గాలంగా మాట్లాడిన ప్రవీణ్, చిద్విలాస్, నిఖిత లను జ్ఞాపికాలతో సత్కరించారు.ఈ కార్యక్రంలో అసోసియేషన్ ఆర్గనైసింగ్ సెక్రటరీ కల్పలత, సభ్యుల హైమావతి, శివప్రసాద్ మరియు విధార్థులు పాల్గొన్నారు.

పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Shri Netaji Subhash Chandra Bose 125th Jayanti Celebrations

Natyam ad