Natyam ad

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం

తిరుపతి ముచ్చట్లు:

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన ఆదివారం ఉదయం రథోత్సవం కన్నులపండుగ‌గా జరిగింది.ఉదయం 7.10 గంటలకు ర‌థోత్స‌వం మొద‌లై ఆలయ నాలుగు మాడ వీధుల్లో సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు. సర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకలదేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధులలో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల కోరికలు సిద్ధిస్తాయని విశ్వాసం.
రథోత్సవం ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయక్షేత్రాలలో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన పాలకడలి గారాలపట్టిని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది.రథోత్సవం అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి రథమండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు. కాగా సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది.రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వవాహనంపై అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.

 

 

Post Midle

ర‌థోత్స‌వంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జేఈవో  వీర బ్రహ్మం దంపతులు, ఎస్ వీబీసీ సిఈవో  షణ్ముఖ్ కుమార్ సిఈ  నాగేశ్వరరావు, ఎస్ ఈ  సత్యనారాయణ ,ఈ ఈ లు  మనోహర్,  నరసింహ మూర్తి , విఎస్వోలు బాల్ రెడ్డి,  మనోహర్, ఆలయ డెప్యూటీ ఈవో  లోకనాథం, ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ‌నివాసాచార్యులు, ఏఈవో  ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు  బాబు స్వామి, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్  దాము పాల్గొన్నారు.

 

Tags: Shri Padmavati Goddess Chariotsavam in splendor

Post Midle