చిన్నశేష వాహనంపై మోహన కృష్ణుడి అలంకారంలో శ్రీ‌ ప్రసన్న వేంకటేశ్వరస్వామి

తిరుపతి ముచ్చట్లు:

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం ఉదయం 8 గంట‌లకు స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై మోహన కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు.చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. పంచశిరస్సుల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయస్కరం.సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు హంస వాహనసేవ జరగనుంది.వాహ‌న‌సేవ‌లో ఆల‌య ఏఈవో  రమేష్, సూపరింటెండెంట్‌  శ్రీ‌వాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్  శివ కుమార్ పాల్గొన్నారు.

 

Tags:Shri Prasanna Venkateswaraswamy in the decoration of Mohana Krishna on the Chinnashesha vehicle

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *