కపిలతీర్థంలో ఘనంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం ఘనంగా జరిగింది.ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పుణ్యాహవాచనం, కలశ స్థాపనపూజ, సుబ్రహ్మణ్యస్వామి హోమం, పూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు.జనవరి 18వ తేదీ శ్రీ దుర్గా, లక్ష్మీ, సరస్వతి అమ్మవార్ల హోమం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈవో పార్థసారథి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags: Shri Subrahmanya Swamy’s Homa in Kapilatirtha