శ్రీ…నన్ను వాడుకొని వదిలేశాడు : నికిషా

Shri ... used to leave me: Nickshaw

Shri ... used to leave me: Nickshaw

Date:17/10/2018

ముంబై ముచ్చట్లు:
టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌పై కొమరం పులి హీరోయిన్ నికీషా పటేల్ తీవ్ర ఆరోపణలు చేసింది. తెలుగుతోపాటు తమిళం, మళయాళంలో పలు సినిమాల్లో నటించిన నికీషా.. తాను శ్రీశాంత్‌తో సహజీవనం చేశానని చెప్పుకొచ్చింది. పెళ్లి కాక ముందు.. ఇప్పటి తన భార్యతో మాజీ క్రికెటర్ డేటింగ్ చేస్తున్న సమయంలోనే నేను అతడితో చేశానని నికీషా తెలిపింది. బిగ్‌బాస్‌లో పాల్గొంటున్న శ్రీశాంత్ ఇటీవలే హౌస్‌మేట్స్‌కు తన లవ్ స్టోరీ చెప్పాడు. ఏడేళ్లపాటు భువనేశ్వరీని ప్రేమించి పెళ్లాడనని చెప్పాడు. మరి అదే సమయంలో ఏడాదిపాటు అతడు నాతో ఎలా సహజీవనం చేశాడో అర్థం కావడం లేదని పవన్ హీరోయిన్ తెలిపింది. బ్రేకప్ తర్వాత నేను శ్రీశాంత్‌ను కలవలేదు. కానీ బిగ్‌బాస్ షోలో అతణ్ని చూస్తున్నా. భువనేశ్వరిని పెళ్లి చేసుకోవడానికి ముందు ఏడేళ్లపాటు ఆమెను ప్రేమించానని శ్రీ చెప్పాడు. మరి దాదాపు ఆ టైంలోనే అతడు నాతో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు.. అప్పుడు తను నాతో ఏం చేశాడు? అని నికీషా నిలదీసింది. ఈ ఐదేళ్లలో బ్రేకప్ తర్వాత శ్రీశాంత్‌కు దూరంగా ఉంటున్నా. కానీ నా దగ్గరున్న చాలా ప్రశ్నలకు సమాధానం లేదు. శ్రీశాంత్ చీట్ చేశాడు. ఇది నాకు చాలా బాధ కలిగించిందని నికీషా తెలిపింది. శ్రీశాంత్ 2013లో నికీషాను పెళ్లాడగా.. వారికి ఇద్దరు పిల్లలున్నారు.
Tags:Shri … used to leave me: Nickshaw

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *