తిరుమలలో శాస్త్రోక్తంగా శ్రీ వరాహస్వామి జయంతి
తిరుమల ముచ్చట్లు:
ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూ వరాహస్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం వరాహ జయంతి శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేపట్టారు. అనంతరం వేదమంత్రాల నడుమ మూలవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో లోకనాధం తదితరులు పాల్గొన్నారు.

Tags: Shri Varahaswamy’s birth anniversary in Tirumala
