జూన్ 28న విడుద‌ల‌వుతున్న‌ శ్రీవిష్ణు, నివేథా థామ‌స్ `బ్రోచేవారెవ‌రురా` 

Date:11/06/2019

హైదరాబాద్‌ముచ్చట్లు:

శ్రీవిష్ణు, నివేదా థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `బ్రోచేవారెవ‌రురా`. ఈ చిత్రం జూన్ 28న విడుద‌ల కానుంది. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. శ్రీవిష్ణు, వివేక్ ఆత్రేయ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న రెండో చిత్రం `బ్రోచేవారెవ‌రురా` కావ‌డం గ‌మ‌నార్హం. `చ‌ల‌న‌మే చిత్ర‌ము… చిత్ర‌మే చ‌ల‌న‌ము` అనేది ఈ చిత్రానికి ఉప‌శీర్షిక‌. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. క్రియేటివ్ నెరేష‌న్‌ను, ఆర్టిస్టిక్ అంశాల‌కు జ‌నాలు ఫిదా అవుతున్నారు. స‌త్య‌దేవ్‌, నివేతా పెతురాజ్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ స‌పోర్టింగ్ రోల్స్
చేశారు. వివేక్ సాగ‌ర్ స్వ‌రాలందించారు. ఈ చిత్రం షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మ‌న్యం ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై విజ‌య్ కుమార్ మ‌న్యం నిర్మిస్తున్నారు.`బ్రోచేవారెవ‌రురా` ట్రైల‌ర్, ఆడియో విడుద‌ల గురించి త్వ‌ర‌లోనే నిర్మాత ప్ర‌క‌టించ‌నున్నారు. న‌టీన‌టులు:శ్రీ విష్ణు, నివేదా థామ‌స్‌, స‌త్య‌దేవ్‌, నివేతా పెతురాజ్‌, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌

 

డెబ్యూ మేఘాంశ్ శ్రీ‌హ‌రికి.. `రాజ్‌దూత్` టీజ‌ర్‌కి అద్భుత స్పంద‌న‌!

Tags: shri-vishnu-nikhitha-thomas-who-is-releasing-on-june-28th-is-broccanever

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *