శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలి
అక్టోబర్ 1 నే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం అధికారికంగా జరపాలి
ఆర్ సి పి రాష్ట్ర కార్యదర్శి రవి శంకర్ రెడ్డి
కడప ముచ్చట్లు:
భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం తన ప్రాణాలను అర్పించన, అమరజీవి పొట్టి శ్రీరాములు సాధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 1956 లో దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం అధికారికంగా కొనిఆడాలని, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవి శంకర్ రెడ్డి కోరారు, 1956లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రాన్ని పురస్కరించుకొని, పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీబాగ్ ఒప్పందంలో భాగంగా, కర్నూల్ రాజధానిగా, రాష్ట్రం ఏర్పడడం అది ఈ రోజె కవడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి, శ్రీభాగ్ ఒప్పందం ప్రకారమే రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తున్నామని అసెంబ్లీలో ప్రకటించరు, నీవు శ్రీబాగ్ ఒప్పందాన్ని నిజంగా అమలు చేసినట్లయితే! ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అక్టోబర్ 1 న అధికారికంగా ఎందుకు జరపడం లేదని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వం నిజంగా శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం చేస్తే, రాజధాని కూడా రాయలసీమ కే రావాలి, దానితోపాటు నీళ్ల వాటా, నిధుల వాటా, ఎమ్మెల్యేల సీట్లు, అధికారికంగా అక్టోబర్ 1న రాష్ట్ర అవతరణ దినం గా చేసినప్పుడే నీవు శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేశవాని నమ్ముతాం. అలా కాకుండా సొంత ప్రయోజనాల కోసం, వ్యాపార ప్రయోజనాల కోసం విశాఖపట్టనాన్ని పరిపాలనా రాజధానిగా చేసి, రాయలసీమ ప్రజలను మోసం చేయాలని చూస్తే! గత ఎన్నికలలో చంద్రబాబు నాయుడు కి ఎన్ని సీట్లు ఐతే వచ్చాయో! రానున్న ఎన్నికల్లో కూడా మీకు అన్ని సీట్లు వస్తాయని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో, నగర కార్యదర్శి మక్బూల్ భాష, కార్యదర్శివర్గ సభ్యులు ప్రసాద్, సుబ్బరాయుడు, లక్ష్మీదేవి, రైతు సంఘం నాయకులు ప్రతాపరెడ్డి, మునిరెడ్డి, డి జి హెచ్ పి ఎస్, నగర అధ్యక్ష కార్యదర్శులు, వెంకటేష్ నాగరాజు నాయకులు పెంచలయ్య ఖాసీం, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Tags: Shribag agreement should be implemented
