కోరుట్లలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

కోరుట్ల  ముచ్చట్లు:

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో పలుచోట్ల ఘనంగా జరుపుకున్నారు చిన్నారులు శ్రీ కృష్ణుడు రాధా ల వేషం ధరించి ఆటలాడారు.. అనంతరం ఉట్టి కొట్టి సంబరాలు జరుపుకున్నారు. మరోపక్క ఉదయం నుండి దేవాలయాలలో సందడి నెలకొంది జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శ్రీ నారాయణ స్కూల్ లో గురువారం రోజున శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.స్కూల్ కరస్పాండెంట్ శ్రీమతి పిన్నంశెట్టి జ్యోతిర్మయి మాట్లాడుతూ మన భారత దేశ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని అటువంటి సాంప్రదాయ పండుగలలో కృష్ణాష్టమి కూడా ఒకటి అని అన్నారు.మన దేశ సాంస్కృతి సాంప్రదాయ పండుగలను పిల్లలకు తెలియజేయడానికే ఇలాంటి కార్యక్రమాలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Tags:Shrikrishna Janmashtami celebrations in Korut

Leave A Reply

Your email address will not be published.