గజ వాహనంపై శ్రీవారి చిద్విలాసం
రామసముద్రం ముచ్చట్లు
రామసముద్రం మండలంలోని పంచాయతీ కేంద్రమైన చెంబకూరు సమీపంలో గుట్టపై వెలసి ఉన్న శ్రీ గట్టు వెంకటేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా మంగళవారంరోజు 10వ పనకట్టుకు చెందిన వారు ఈ కార్యక్రమమును అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాజా భజంత్రీలతో, కోలాటలు, చెక్కభజనలతో ,బాణా సంచాలు పేల్చి అంగరంగ వైభవంగా స్వామివారిని పూరవీధులలో ఊరేగింపు నిర్వహించారు. మరియు నాటక మండలి కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు కనువిందు వేలాది మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావున కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఆలయ అర్చకులు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు , గ్రామస్తులు కార్యనిర్వాకులు తదితరులు పాల్గొన్నారు.

Tags: Shrivari Chidvilasa on Gaja Vahanam
