Shrivari's vision for Diva and Orphans

దివ్యాంగులు, అనాథ భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం పుణ్య‌కార్యం :

-టిటిడి ఛైర్మ‌న్   వైవి.సుబ్బారెడ్డి

Date:23/02/2020

శ్రీ‌కాకుళం ముచ్చట్లు:

శ్రీ‌కాకుళం జిల్లాలోని ఓ అనాథాశ్ర‌మానికి చెందిన 17 మంది దివ్యాంగులు, అనాథ భ‌క్తుల‌కు సొంత ఖ‌ర్చుల‌తో తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నంతోపాటు మ‌రికొన్ని ఆల‌యాలను సంద‌ర్శించేలా ఏర్పాట్లు చేశాన‌ని, దీన్ని పుణ్య‌కార్యంగా భావిస్తున్నాన‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు   వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో ఆదివారం ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడారు.

తాను సింహాచ‌లం దేవ‌స్థానికి ద‌ర్శ‌నానికి వెళ్లిన‌పుడు అనాథాశ్ర‌మం నిర్వాహ‌కుడైన శ్రీ సిద్ధార్థ క‌లిశార‌ని, స్వామివారిని ద‌ర్శించుకోవాల‌ని దివ్యాంగులు, అనాథ భ‌క్తులు ఎదురుచూస్తున్నార‌ని తెలిపార‌ని ఛైర్మ‌న్ వివ‌రించారు. ఆ మేర‌కు శ్రీ‌కాకుళం నుండి రైలు ప్ర‌యాణ ఖ‌ర్చులు భ‌రించి తిరుమ‌ల‌కు ర‌ప్పించి స్వామివారి ద‌ర్శ‌నం చేయించామ‌ని తెలిపారు. అదేవిధంగా, కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్ ఆల‌యాల‌ను కూడా సంద‌ర్శించేందుకు ఏర్పాట్లు చేశామ‌ని వివ‌రించారు. శ్రీ‌వారి ద‌ర్శ‌నానంత‌రం దివ్యాంగులు, అనాథ‌లు ఎంతో సంతోషం వ్య‌క్తం చేశార‌ని, దీన్ని భ‌గ‌వంతుని సేవ‌గా భావిస్తున్నాన‌ని తెలిపారు.

టిటిడిపై సామాజిక మాధ్య‌మాలలో అవాస్త‌వ క‌థ‌నాన్ని ఖండించిన ఛైర్మ‌న్‌

టిటిడికి సంబంధించి సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌చార‌మ‌వుతున్న అవాస్త‌వ‌ క‌థ‌నాన్ని టిటిడి ఛైర్మ‌న్  వైవి.సుబ్బారెడ్డి ఖండించారు. ఈ అంశంపై టిటిడి అధికారులు విచార‌ణ జ‌రుపుతున్నార‌ని తెలిపారు. ఇలాంటి పోస్టులు పెట్టిన‌వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

ఈస్ట్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు

టిటిడి నిధులు రాష్ట్ర ప్ర‌భుత్వ ఖాతాలోకి జ‌మ అయ్యాయంటూ అవాస్త‌వాల‌ను సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌చారం చేస్తున్న వారిపై ఆదివారం తిరుప‌తిలోని ఈస్ట్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. టిటిడి అధికారుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు.

డయల్ 100 కాల్ తో 5 మందిని కాపాడిన పోలీసులు.

Tags: Shrivari’s vision for Diva and Orphans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *