ఏసీబీ వలలో ఎస్ఐ
మంగళగిరి ముచ్చట్లు:
రెండు రోజుల్లో ముగ్గురు అధికారులను లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు. తాజాగా నల్లపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ కట్టా వెంకటయ్య, లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఓ కేసులో నిందితులను అరెస్టు నుండి తప్పించేందుకు రూ.40,000/- అయన లంచంగా డిమాండ్ చేసాడు. గుంటూరు జిల్లా, భవానీనగర్ 1వ లేన్లోని ఇంటి వద్ద లంచం తీసుకుంటున్నప్పుడు ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
Tags: SI in ACB net

