ఆగస్టు 7న ఎస్ఐ ప్రిలిమ్స్‌

హైదరాబాద్‌ ముచ్చట్లు

జులై 30 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 81 వేల పోస్టులను ప్రభుత్వం విడుతల వారీగా భర్తీ చేస్తున్నది. ఇందులో భాగంగా పోలీస్‌ శాఖ ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్‌ 25న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రిలిమ్స్‌ పరీక్షను ఆగస్టు 7న నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన హాల్‌టికెట్లు జులై 30 (శనివారం) ఉదయం 8 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ ప్రకటించింది.
పరీక్ష దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆగస్టు 5వ తేదీ రాత్రి 12 గంటల వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది.అడ్మిట్‌ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌ www.tslprb.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది. ఏదైనా సమస్య తలెత్తినట్లయితే support@tslprb.inకు ఈ-మెయిల్‌ చేయవచ్చని లేదా 93937 11110, 939100 5006 నంబర్లను సంప్రదించవచ్చు. హైదరాబాద్‌ సహా రాష్ట్రంలో 35 పట్టణాల్లో 503 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, పరీక్షను ఆగస్టు 7న (ఆదివారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తామని ప్రకటించింది. పరీక్షకు మొత్తం 2,47,217 మంది హాజరుకానున్నారు.

Tags:SI Prelims on 7th August

Leave A Reply

Your email address will not be published.