అంబేద్కర్ కు ఘన  నివాళులు

Siblings to Ambedkar

Shri B.R. Ambedkar in his office.

Date:14/04/2014
హైదరాబాద్ ముచ్చట్లు:
భారత రాజ్యంగ నిర్మాత  అంబేద్కర్ జయంతి సందర్బంగా తెలుగుతల్లి ఫ్లై ఓవర్ దగ్గరలోని అంబేద్కర్ విగ్రహానికి వివిధ వర్గాల నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్  చైర్మెన్ గంట చక్రపాణి, జయప్రకాశ్ నారాయణ్, శాసన మండలి చైర్మెన్ స్వామిగౌడ్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. శాసన మండలి చైర్మెన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ అబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే దిశగా పాలన కొనసాగుతుందన్నారు. అంబేడ్కర్ అందరి వాడు. కొందరివాడుగా ప్రచారం చేస్తున్నారు. సూర్య చంద్రులు ఉన్నంత వరకు అంబేడ్కర్ గుర్తుండిపోతారని అన్నారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు జానారెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ దళితుల కోసం అనేక పోరాటాలు చేశారు. ప్రజాస్వామ్య నికి మూలం అయ్యాడు. సమాజం లో అందరికి నాయకుడు. అయన జయంతి నాడు అంబేద్కర్  ను   ప్రజలు స్మరించుకోవాలని అన్నారు. కాంగ్రెస్ సీనిమర్ నేత వి హనుమంత రావు మాట్లాడుతూ అందరిని కలుపుకొని పోవాలి అని చూసారు. రాజ్యాంగం ను రాయడం దిట్ట అని అప్పజెప్పారు. తెలంగాణ లో బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జారిగిన నాడే…నిజమైన న్యాయం జరుగుతది. బడుగు బలహిన  వారి రాజ్యం వచ్చినా నాడే, నిజమైన తృప్తి వుంటుందని అన్నారు.  ఎమ్మెల్సీ  పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా దళితులపై దాడులు పెరుగుతున్న కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని విమర్శించారు. రెండేళ్ల క్రితం 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెడతామన్న సీఎం కేసీఆర్ హామీ ఏమైనట్లు అని ప్రశ్నించారు.
Tags:Siblings to Ambedkar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *