తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’ చేసిన సాయిపల్లవి

'Sidapalli' of Telugu audience

'Sidapalli' of Telugu audience

Date:11/01/2019
సిడ్ని ముచ్చట్లు:
తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’ చేసిన సాయిపల్లవి ఇటీవలే శర్వానంద్‌తో కలిసి ‘పడి పడి లేచే మనసు’తో మన ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 21న విడుదలైన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. టాక్ ఫర్వాలేదనిపించింది, కానీ కలెక్షన్లు నిరాశజనకంగా ఉన్నాయి. దీంతో హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘పడి పడి లేచే మనసు’ ఫ్లాప్‌ సినిమాల జాబితాలోకి వెళ్లింది. దీంతో ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సాయి పల్లవి సగం రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుందట. సినిమా ప్రారంభానికి ముందు ఆమెకు సగం పారితోషికం ఇచ్చిన నిర్మాతలు.. మిగతా సగాన్ని సినిమా విడుదలయ్యాక ఇవ్వబోయారట. కానీ సినిమా ఫ్లాప్ కావడంతో డబ్బులు తీసుకోవడానికి సాయి పల్లవి అంగీకరించలేదట. నిర్మాతకు నష్టాలను తగ్గించడం కోసం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. నిర్మాతకు బాసటగా నిలిచేందుకు సాయి పల్లవి ఇలా చేయడం పట్ల సినీ పరిశ్రమ మరోసారి ఫిదా అయిపోయింది. గతంలో హీరోలు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగి ఇచ్చేసిన సందర్భాలున్నాయి. కానీ హీరోయిన్లు తమ రెమ్యూనరేషన్ వద్దనడం మాత్రం అరుదైన విషయమే.
Tags:’Sidapalli’ of Telugu audience

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *