రాష్ట్ర సమస్యలపై చర్చకు సిద్దం-ఈటల రాజేందర్
రంగారెడ్డి ముచ్చట్లు:
ఉద్యమం నాటి కేసీఆర్ కు.. ఇప్పటి కేసీఆర్కు చాలా తేడా ఉందని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు. చంపా పేటలో భాగ్యనగర్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధాని మోదీ 8 ఏళ్ళ ప్రజా సంక్షేమ పాలన సదస్సుకు ఆయన హాజరయ్యారు. పదవుల కోసం పెదవులు ముసే దద్దమ్మలు టిఆర్ఎస్ వాళ్ళు.. టీఆర్ఎస్ పోయి బి ఆర్ ఎస్ వచ్చింది.. ఎనిమిది సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీని ప్రజలు వీఆర్ఎస్ తీసుకోవాలని కోరుతున్నారని అన్నారు రెచ్చగొడితే ఆత్మగౌరవం కోసం రాజీనామా చేశానని స్పష్టం చేశారు. రాష్ట్ర సమస్యలపై చర్చకు సిద్ధమని అన్నారు. కాషాయ జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరాలని పిలుపునిచ్చారు.
Tags: Siddam-Itala Rajender ready for discussion on state issues

