సిద్ధరామయ్యకు హైకమాండ్ పూర్తి స్వేచ్ఛ

Siddaramaiah's High Command is complete freedom

Siddaramaiah's High Command is complete freedom

Date:18/11/2019

బెంగళూరు ముచ్చట్లు:

సిద్ధరామయ్యకు కాంగ్రెస్ హైకమాండ్ పూర్తి స్వేచ్ఛనిచ్చింది. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచార బాధ్యతలు మొత్తం ఆయనే చూసుకునేలా కార్యాచరణను కాంగ్రెస్ రూపొందించింది. పదిహేను స్థానాల్లో కనీసం 12 స్థానాలను సాధించి మరోసారి ముఖ్యమంత్రి కావాలని సిద్ధరామయ్య గట్టిగానే శ్రమపడుతున్నారు. కర్ణాటకలో జరుగుతున్న పదిహేను స్థానాల ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ విన్నూత్న ప్రచారంతో ముందుకు వెళ్లనుంది.మరోసారి ముఖ్యమంత్రి అనే నినాదంతో సిద్ధరామయ్యను ముందు నిలుపుతున్నారు. గత సిద్ధరామయ్య పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ కార్యక్రమాలను కూడా ముందుకు తెస్తున్నారు. ఉప ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిస్తే తిరిగి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అవుతారని, సుస్థిరమైన పాలన అందిస్తారన్న ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా చేపట్టింది. బలవంతంగా బీజేపీ తమ పార్టీ నాయకులను ప్రలోభాలకు గురిచేసిందని కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలగింది.సిద్ధరామయ్యకు బహుశా ఇవే చివరి ఎన్నికలు కావచ్చన్న ప్రచారాన్ని కూడా కాంగ్రెస్ ప్రజల్లోకి సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్లగలగుతోంది. వయసురీత్యా, అనుభవం దృష్ట్యా సిద్దరామయ్య సేవలు కన్నడనాట అవసరమన్న ప్రచారం బాగా చేస్తుంది హస్తం పార్టీ. సిద్ధరామయ్య కూడా పదిహేను నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రచారానికి కార్యాచరణను రూపొందించారు. మాజీ మంత్రులను ఒక్కొక్క నియోజకవర్గానికి బాధ్యులుగా నియమించారు.అయితే మరోసారి ముఖ్యమంత్రి అనే నినాదంపై సెటైర్లు కూడా విన్పిస్తున్నాయి. జనతాదళ్ ఎస్ మద్దతిస్తేనే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయి. పదిహేనుకు పదిహేను నియోజకవర్గాలు గెలిచినా సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కావాలంటే దళపతుల సహకారం అవసరం. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అంటే కుమారస్వామి, దేవెగౌడ అంగీకరించని పరిస్థితి. దీనిపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే దీనికి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇవ్వాల్సిన కాంగ్రెస్ మాత్రం కామ్ గానే ఉంది.

 

పాలి హౌస్ తో విస్తారంగా సాగు

 

Tags:Siddaramaiah’s High Command is complete freedom

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *