సైరా భారీ బిజినెస్

Sierra is a huge business
Date:02/05/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రం షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. కొన్ని రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అవ్వనుంది. అయితే లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ కి అంత క్రేజ్ రాకపోవడంతో ఈ సినిమాకి ఇంకా మార్కెట్ స్టార్ట్ అవ్వలేదు. అయితే నైజాం నుంచి మాత్రం బయ్యర్లు ఒక అడుగు ముందుకు వేసి, భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నైజాం రైట్స్ కు 25 కోట్లు పైగా ఆఫర్ చేశారట బయ్యర్ కం ప్రొడ్యూసర్ నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి. అయితే సుధాకర్ రెడ్డి కొంతకాలం నుండి సైలెంట్ గా ఉన్నారు. బయ్యర్ గా కన్నా ప్రొడ్యూసర్ గా గట్టి దెబ్బలు తిన్నారు.ఈసారి అటువంటి తప్పు జరగకూడదని ఆయన, మరికొందరు భాగస్వాములు కలిసి మళ్లీ డిస్ట్రిబ్యూషన్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ ప్రయత్నంలోనే నైజాంలో కాంచన 3ని పంపిణీ చేసారు. ఇదే ఊపుతో మరికొన్ని సినిమాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. పైగా నైజాం ఏరియాకి పెద్దగా పోటీ లేకపోవడంతో సుధాకర్ రెడ్డి మళ్లీ రంగంలోకి దిగారు. కేవలం నైజాంలోనే కాకుండా ఆంధ్రలో కూడా సినిమాలు తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేయాలని డిసైడ్ అయ్యారట. మరి సుధాకర్ రెడ్డి ఇచ్చిన ఆఫర్ కి నిర్మాత రామ్ చరణ్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి.
Tags: Sierra is a huge business

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *