సిఫార్స్ లేఖలపై దర్శనాలు బంద్
తిరుమల ముచ్చట్లు:
తిరుమలలో జూలై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆది వారాలలో సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు, సుప్రభాత సేవలను రద్దు చేస్తు న్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోనిఅన్నమయ్య భవనం లో డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఈవో విలేకరులతో మాట్లాడుతూ, ఘాట్రోడ్లలో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేశామని, మహారాష్ట్రలోని నవీముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 600 కోట్ల రూపాయలు విలువచేసే స్థలాన్ని టిటిడికి మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని, రూ. 100 కోట్ల వ్యయంతో రేమాండ్స్ అధినేత సింఘానియా ఆలయాన్నినిర్మించేందుకు ముందుకు వచ్చారన్నారు. అలాగే టీటీడీ పద్మావతి హృదయాలయంలో ఇప్పటి వరకు 1450 మంది చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించామని, అదేవిధంగా వేసవి సెలవుల్లోతిరుమల శ్రీవారి దర్శనార్ధం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో సేవలందిస్తున్నాయని.. ఇందుకోసం జూలై 15 వ తేదీ వరకు శుక్ర,శని, ఆదివారాల్లో విఐపి బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశామన్నారు.
Tags: Sightings on letters of recommendation are closed

