రూరల్ పోలింగ్ కేంద్రాల్లో సిగ్నల్ ఇబ్బందులు

This is the first time a 10 percent reduction in the city fare

This is the first time a 10 percent reduction in the city fareg

 Date:16/03/2019
తిరుపతి  ముచ్చట్లు:
ఎన్నికల నిర్వహణలో పారదర్శక, వేగవంతమైన నిర్ణయాలకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో అవసరం. అయితే సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో అతి ముఖ్యమైన ఇంటర్నెట్‌ జిల్లాలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉందా? తాత్కాలికంగా అయినా అందించడానికి, బీఎస్‌ఎన్‌ఎల్, ఇతర ప్రైవేటు సంస్థలు సిద్ధంగా ఉన్నాయా? అనే ప్రశ్నలకు సమాధానాలు కనిపించడం లేదు. జిల్లాలోని వందలాది గ్రామాల్లో ఇంటర్నెట్‌ లేని మాట అటు ఉంచితే సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ కూడా రాని పరిస్థితి నెలకొని ఉంది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సదుపాయంతో పనిచేసే పరికరాలను ఏ విధంగా వినియోగిస్తారనే సందేహాలు తలెత్తుతున్నాయి.జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తితే సమాచారాన్ని జిల్లా యంత్రాగానికి ఎలా చేరవేస్తారన్న విషయంలో స్ప ష్టత లేకుంటే కష్టమే. వైర్‌లెస్‌ సెట్ల వినియోగం స మాచారాన్ని చేరవడంలో ఎంతవరకు ఉపయోగపడుతుందనే విషయాన్ని పునఃసమీక్షించుకోవాల్సినవసరం ఎంతైనా ఉంది. తీవ్రతను తెలిపేలా ఫొటోలు, వీడియోలు, డ్యాకుమెంట్లు పంపే విషయంలో ఇ బ్బందులు తప్పకపోవచ్చు.
వెబ్‌కాస్టింగ్‌ విషయంలో ఇంటర్నెట్‌ అవసరమే కీలకమనే విషయాన్ని జి ల్లా యంత్రాంగం గుర్తించాల్సి ఉంది. దీంతోపాటు ఎంతమంది పోలింగ్‌ సిబ్బందికి వైర్‌లెస్‌ సెట్ల విని యోగంపై అవగాహన ఉందనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఏదీ ఏమైనప్పటికీ కనీసం ఫోన్‌ సిగ్నల్స్‌ కూడా లేని ప్రాంతాల్లో వి«ధులు నిర్వహించే పోలీస్‌ సిబ్బందికి ఇబ్బందిగా మారుతుంద న్న విషయాన్ని గుర్తించి సమస్యలు పరిష్కరించాల్సి ఉంది.ప్రభుత్వరంగ టెలికాం ఆపరేటర్‌ బీఎస్‌ఎన్‌ఎ ల్‌ 3జీ సేవలు జిల్లావాసులకు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులో రాని దుస్థితి నెలకొంది. దశాబ్ద కాలంగా ప్రయత్నిస్తున్నా ఈ సేవలను జిల్లా మొత్తానికి అందించడానికి వెనుకబడ్డారు. జిల్లాలోని పెద్దతిప్పసముద్రం మండలంలోని కాట్నగల్లు, గొల్లపల్లె, నిలువరాతిపల్లె, బాగేపల్లె, కమ్మచెరువు, చెట్లవాండ్లప ల్లె ప్రాంతాల్లో 3జీ సేవలు, బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ నేటికీ అందడం లేదు. ఇలాంటి పరిస్థితి జిల్లాలోని మరికొన్ని సరిహద్దు మండలాల్లోని గ్రామాల్లో ఉంది. బ్రాండ్‌బ్యాండ్‌ కనెక్షన్లు ఉన్న ప్రాంతంలో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంటున్న ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ (ఓఎఫ్‌సీ) పర్యవేక్షణ, నిర్వహణ వైఫల్యాలతో అది కూడా అంతంతగానే ఉంది. చిన్నపాటి మరమ్మతులను రోజుల తరబడి చేయడం లేదనే ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అత్యధికంగా, గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యులకు సంస్థ అందిస్తున్న అంతర్జాల సేవలు విసుగు పుట్టిస్తున్నాయనే ఆరోపణలున్నాయి.
వినియోగానికి అనుగుణంగా అధునాతన మార్పులు తేవడంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ వెనుకబాటుతనం కనిపిస్తోంది. సాంకేతిక వినియోగంతో ఎన్నికల నిర్వహణను సంతృప్తికరంగా పూర్తి చేయాలని భావిస్తున్న జిల్లా యంత్రాంగానికి ఫోన్‌ సిగ్నల్స్‌ సమస్యలతోపాటు, ఇంటర్నెట్‌ సమస్యలు తప్పకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రయోగాత్మకంగా నిర్వహించిన వెబ్‌కాస్టింగ్‌ సత్ఫలితాలు ఇవ్వడంతో ఈసారి ఎన్నికల్లో జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వినియోగించాలని ఆదేశాలందాయి. ఈ ప్రక్రియలో కంప్యూటర్ల ను ఇంటర్నెట్‌తో అనుసంధానం చేసి, ప్రత్యేక సాఫ్ట్‌వేర్లతో పోలింగ్‌ నిర్వహణ తీరును ప్రత్యక్షంగా పరిశీ లించడానికి, రికార్డు చేయడం వీలవుతుంది. ఎక్కడైనా ఇబ్బందికరమైన ఘటనలు తలెత్తితే కంట్రోల్‌ రూమ్‌ నుంచి వేగంగా స్పందించడానికి ఉపయోగపడుతుంది. సాంకేతిక అంశాలపై పట్టు ఉన్న విద్యార్థుల సహకారాన్ని గతంలో తీసుకున్నారు. అయితే ఈసారి ఎలా నిర్వహించనున్నారో తెలియని పరిస్థితి.
Tags:Signal difficulties in rural polling centers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *