సిక్కోలు ప్రజలకు క్షమాపణ చెప్పాలి

Sikkoes should apologize to the people

Sikkoes should apologize to the people

Date:23/11/2018
విజయవాడ ముచ్చట్లు:
సిక్కోలు ప్రజలకు క్షమాపణ చెప్పాకే.. జగన్ పాదయాత్రకు జిల్లాలో అడుగు పెట్టాలన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. తుఫాన్ దెబ్బకు వణికిపోయిన శ్రీకాకుళంను పట్టించుకోకుండా.. ప్రభుత్వం బాధితులకు అండగా నిలిస్తే.. వైసీపీ నేతలంతా కలిసి కుట్రలు చేశారని మండిపడ్డారు. బీజేపీతో కుమ్మకై రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ అధినేత తీరును తప్పుబడుతూ.. శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. లేఖలో.. తిత్లీ తుఫాన్‌తో శ్రీకాకుళం జిల్లా కకావికలమైతే బాధితుల్ని ఇప్పటి వరకు బాధితుల్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు కళా వెంకట్రావు. ప్రభుత్వం వెంటనే స్పందించి పునరావాస కార్యక్రమాలు చేపడితే ప్రశంసించాల్సిందిపోయి కుట్రలు చేశారని ఫైరయ్యారు. వైసీపీ నేతల్ని కమిటీ పేరుతో ప్రజల్లోకి పంపించి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. ప్రజల్ని రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్నా.. బాధితుల్ని పరామర్శించే తీరిక లేదా అని నిలదీశారు. పాదయాత్ర నుంచి 80 కి.మీల దూరంలోని పలాసకు వచ్చేందుకు సమయం లేదా అని ప్రశ్నించారు. సిక్కోలు ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే.. జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర మొదలు పెట్టాలన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్‌ ఏనాడైనా ప్రజల కోసం పని చేశారా అని ప్రశ్నించారు వెంకట్రావు. కేసుల మాఫీ కోసం.. నరేంద్ర మోడీ-అమిత్‌ షాతో కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాదయాత్ర చేసినా.. విశాఖ రైల్వేజోన్‌, ఉత్తరాంధ్రకు కేంద్ర నిధుల గురించి ఏనాడైనా ప్రశ్నించారా అంటూ నిలదీశారు. పోలవరం డీపీఆర్-2కు కేంద్రం కొర్రీలపై ఎందుకు మాట్లాడరని.. రాఫెల్‌ కుంభకోణంపై జగన్‌ స్పందించ లేదో చెప్పాలన్నారు. వ్యవస్థలపై నమ్మకం లేదన్న జగన్‌.. ప్రజా ప్రతినిధిగా ఉండే అర్హత ఉందా అని ప్రశ్నించారు.
Tags:Sikkoes should apologize to the people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *