శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పణ

Silk garments from Srirangam to Tirumala Sriravi

Silk garments from Srirangam to Tirumala Sriravi

Date:17/07/2018
తిరుమల ముచ్చట్లు:
 ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం నుంచి శ్రీవారికి ఆరు పట్టువస్త్రాలతో సారెను తమిళనాడు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి శ్రీ రామచంద్రన్, తమిళనాడు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ శ్రీమతి జయ, జాయింట్ కమిషనర్ శ్రీ జయరామన్, అదనపు కమిషనర్ శ్రీమతి కలైమగల్, శ్రీరంగం శ్రీ రంగనాధస్వామి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వేణుశ్రీనివాసన్లు కలిసి సమర్పించారు. మంగళవారం ఉదయం శ్రీబేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన గల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మఠం నుండి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల మీదుగా ఆలయంలోనికి తీసుకువెళ్ళారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.  ఈ సందర్భంగా తిరుమల ఇన్చార్జ్,  తిరుపతి జెఈవో  పోల భాస్కర్ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆణివార ఆస్థానం పర్వదినాన శ్రీరంగం శ్రీరంగనాధుడి చెంత నుండి తిరుమల శ్రీవారికి కానుకగా పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అదేవిధంగా ప్రతి ఏడాది కైశిక ఏకాదశి పర్వదినాన తిరుమల శ్రీవారి చెంత నుండి శ్రీరంగంలోని శ్రీరంగనాధస్వామివారికి కానుకగా పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, టిటిడి ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఇన్చార్జ్ సివిఎస్వో  శివకుమార్‌రెడ్డి, విజివో  రవీంధ్రారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పణ https://www.telugumuchatlu.com/silk-garments-from-srirangam-to-tirumala-sriravi/
Tags:Silk garments from Srirangam to Tirumala Sriravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *