Natyam ad

రూ:4 లక్షల విలువ చేసే వెండి ఆభరణాలు అమ్మవారికి వితరణ

చౌడేపల్లె  ముచ్చట్లు:

పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయానికి కాటిపేరు సెగ్మెంట్ ఎంపీటీసీ జ్యోతమ్మ కృష్ణారెడ్డి, చరణ్ రెడ్డిల దంపతులు వెండి ఆభరణాలను విరాళంగా అందజేశారు. నాలుగు లక్షలు విలువచేసే వెండి తట్టా రెండు దీపాలను వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తో కలిసి ఈవో చంద్రమౌళి ఆలయ కమిటీ చైర్మన్ నాగరాజ రెడ్డి కు అందజేశారు. తను కోరిన కోరిక నెరవేయడంతో అమ్మవారికి ముక్కులు చెల్లించి వెండి ఆభరణాలు కానుకగా ఇచ్చినట్టు దాత పేర్కొన్నారు. దంపతులను ఆలయ అధికారులు సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో పుంగనూరు ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి,నేతలు సో మల మల్లికార్జున్ రెడ్డి,ఇమ్రాన్,సురేంద్ర రెడ్డి,తదితరులు ఉన్నారు.

Post Midle

Tags: Silver ornaments worth Rs.4 lakhs distributed to Amma

Post Midle