శ్రీస్వామివారి నిత్యకళ్యాణం  

– భారీ వర్షంలోనూ తగ్గని భక్తుల తాకిడి

 

విశాఖపట్నం ముచ్చట్లు:

 

సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామివారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు. వర్షం కురుస్తున్నా  లెక్కచేయకుండా భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజలు చేస్తున్నారు. నిత్య కళ్యాణంలో ప్రత్యక్షంగా పాల్గొనేవారి సంఖ్య పెరుగుతోంది.  వెయ్యి రూపాయలు చెల్లించి ఎవరైనా … ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే  నిత్యకళ్యాణంలో పాల్గొనే వీలుంది.  ఇవాళ శుక్రవారం శ్రీతాయార్ల సన్నిధిలో అర్చకులు, వేద పండితులు   సహస్రనామార్చనం జరిపారు. ఆర్జిత సేవల్లో పరోక్షంగా పాల్గొనే భక్తులకు ఏరోజుకారోజు స్వామివారి ప్రసాదాన్ని అధికారులు రిజిస్టర్డ్ పోస్టులో పంపిస్తున్నారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Simhachalam Srivarahalakshminarusimhaswamy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *