కాంగ్రెస్, బీజేపీలకు ఒకేసారి కౌంటర్

హైదరాబాద్ ముచ్చట్లు:


రాజకీయ పార్టీలు అన్నాక ప్రత్యర్థుల ఆరోపణలకు ఎదుటి వారి కౌంటర్లు కామనే. కానీ అందరిలా స్పందించడం సీఎం కేసీఆర్ నైజం కాదనే విషయం అందరికి తెలిసి సగంతే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలకు ఒకేసారి కౌంటర్ ఇచ్చేలా ముఖ్యమంత్రి అదిరిపోయే ప్లాన్ రెడీ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన వరంగల్ సభకు, ఎల్లుండి జరగబోయే బీజేపీ సభకు ఒకే దెబ్బతో రిప్లే ఇవ్వాలని గులాబీ బాస్ మూహుర్తం ఫిక్స్ చేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత వారం నిర్వహించిన వరంగల్ రైతు సంఘర్షణ సభతో కాంగ్రెస్‌లో ఉత్సాహం రెట్టింపు అయింది. రైతు డిక్లరేషన్‌కు రాహుల్ గాంధీ సైతం ఆమోద ముద్ర వేయడంతో దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.ఇక రాహుల్ సభకు మించిపోయేలా మే 14న తుక్కుగూడలో సభకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలోని ప్రజాదరణ నిరూపించేలా భారీగా జన సమీకరణకు కసరత్తు జరుగుతోంది. ఈ సభకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరుకానుండటంతో కమలం పార్టీ ఈ మీటింగ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వరంగల్ సభతో కాంగ్రెస్‌కు వచ్చిన హైప్‌ను ఈ సభతో తొలగిపోయేలా బీజేపీ ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఎన్నికలే లక్ష్యంగా అమిత్ షా ఈ సభలో కీలక ప్రకటను చేసే అవకాశం ఉందంటున్నారు బీజేపీ నేతలు.ఇక కాంగ్రెస్, బీజేపీ వంతు పూర్తి కానుండటంతో మిగిలిన టీఆర్ఎస్ పార్టీ సైతం వీరికి కౌంటర్ ఇచ్చేలా ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాహుల్ సభ అనంతరం టీఆర్ఎస్‌లోని మంత్రులు, ఎమ్మెల్యేలు కౌంటర్ చేశారు. కానీ గులాబీ దళపతి మాత్రం ఎక్కడా నోరుమెదపలేదు. కాంగ్రెస్, బీజేపీలకు ఒకే వేదికగా తూర్పారబట్టే ప్రణాళికలో కేసీఆర్ ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా త్వరలో తెలంగాణలోని చెన్నూరు నియోజకవర్గంలో ఓ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే నియోజకవర్గంలో ఓ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయడంతో పాటు మరో ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయాని నిర్ణయించారట.అక్కడే ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలనే కేసీఆర్ భావిస్తున్నారట. ఇదే వేదికగా కాంగ్రెస్ బీజేపీ నేతల విమర్శలకు ధీటైన జవాబు ఇవ్వాలని అనుకుంటున్నారట. అన్ని సజావుగా జరిగితే మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో ఈ బహిరంగ సభ ఉండొచ్చని టీఆర్ఎస్ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల ఎజెండాతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ సైతం ఈ సభ ద్వారా ముఖ్యమైన ప్రకటనలు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అదే జరిగితే కేసీఆర్ సభలో రాష్ట్ర రాజకీయం మండుటెండల్లో మరింత వేడిని పుట్టించడం ఖాయం అంటున్నారు.

Post Midle
Natyam ad