ఒకేసారి శీతాకాలం, బడ్జెట్ సమావేశాలు

Date:17/11/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుండటం, రాజధాని ఢిల్లీలో పరిస్థితి ప్రమాదకరంగా ఉన్న నేపథ్యంలో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల నిర్వహణ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శీతాకాల సమావేశాల రద్దుకే కేంద్ర ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. లుస్తోంది. ప్రస్తుతం ఈ విషయంపై చర్చలు జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. శీతాకాల సమావేశాలను బడ్జెట్‌ సమావేశాలతో కలిపి నిర్వహించడం, నేరుగా బడ్జెట్‌ సమావేశాలే నిర్వహించడంపై సమాలోచనలు జరుపుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్‌లు సైతం శీతాకాల సమావేశాల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించలేదని తెలుస్తోంది. కరోనా విజృంభణ కొనసాగడం సహా అధికారులతో చట్టసభ్యులు కలిసి పనిచేయాల్సి రావడం వల్ల ఈ సమావేశాలను నిర్వహించకపోవడమే మంచిదన్న వాదన తెరపైకి వచ్చింది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సాధారణంగా పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నవంబరు నెల మధ్యలో ప్రారంభమై డిసెంబరు మధ్య వరకు కొనసాగుతాయి. వర్షాకాల సమావేశాల్లోనూ పలువురు పార్లమెంట్ సభ్యులు కరోనా బారినపడటంతో వాటిని అర్దాంతరంగా ముగించాల్సి వచ్చింది.

 

 

ఏడాదిలో మూడుసార్లు పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తామని, అయితే, ఇదేం తప్పనిసరి కాదని లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ పీడీటీ ఆచార్య అన్నారు. కానీ, రాజ్యాంగ నిబంధనల ప్రకారం రెండు సమావేశాల మధ్య ఆరు నెలలు విరామం ఉండరాదన్నారు. ఒకవేళ ఈ ఏడాది రెండు సమావేశాలను కలిపి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తే అది నిబంధనల ఉల్లంఘించినట్టు కాదని వ్యాఖ్యానించారు.ఈ ఏడాది వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు సెప్టెంబరు 14న ప్రారంభం కాగా.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెండు రోజుల ముందే ముగించారు. రెండు సభలను వేర్వేరు షిఫ్ట్‌ల్లో నిర్వహించారు. అయినా సరే పలువురు ఎంపీలు, సిబ్బంది కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో షెడ్యూల్ కంటే ముందుగానే సమావేశాలు ముగిశాయి. ప్రస్తుతం ఢిల్లీలోనూ పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. రోజూ 8వేలకుపైగా కోవిడ్-19 కేసులు బయటపడుతున్నాయి.

బై పోల్ వార్ ప్రారంభమైనట్టే

Tags: Simultaneously winter, budget meetings

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *