వారంరోజుల్లో సింగపూర్ స్పందించింది : సీఎం చంద్రబాబు

Singaporean responded weekly: CM Chandrababu

Singaporean responded weekly: CM Chandrababu

Date:13/04/2018
సింగపూర్ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకపోవడం పెద్ద సంక్షోభమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సింగపూర్ లో హిందూస్థాన్ టైమ్స్ మింట్ ఆసియా లీడర్ షిప్ సమ్మిట్ లో ఆయన ప్రసంగించారు. అయితే ఆ సంక్షోభాన్నే అవకాశంగా మార్చుకుని ముందుకు సాగుతున్నామన్నారు. రాజధాని నిర్మాణానికి భూ సేకరణ పెద్ద సవాల్ అని చెప్పిన ఆయన రైతుల సహకారంతో ఆ సవాల్ ను అధిగమించామన్నారు. రెండు దశాబ్దాలకు పైగా సింగపూర్ను పరిశీలిస్తున్నాను, వారు చాలా వేగంగా ముందడుగు వేయగలిగారు, ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రాష్ట్రం, నాలుగేళ్ల పసికూన, అత్యంత జాగరూకతతో సాకవలసిన బిడ్డ, రాజధాని కూడా లేకపోవడం  రాష్ట్రానికి అన్నింటికంటే పెద్ద సంక్షోభమని వ్యాఖ్యానించారు.  సైబరాబాద్ వంటి నగరాన్ని నిర్మించిన అనుభవం తనకు ఉందని చెప్పిన ఆయన ఆ అనుభవంతో సింగపూర్ తరహా రాజధానిని నిర్మిస్తామన్నారు. తొలుత కొత్త రాజధాని కోసం ఒక చక్కటి ఎకో సిస్టమ్ను ఏర్పాటు చేశాం. కొత్త రాజధానికి చాలినంత భూమిని సమకూర్చుకోవడం పెద్ద సవాల్, అంత భూమి కూడా ప్రభుత్వపరంగా ఎక్కడా లభ్యంగా లేదు, అంత భూమిని ఎలా సమకూర్చుకోవాలన్న అంశంపై మథనం చేశాను, మా దగ్గర అంత భూమిని సమకూర్చుకునేందుకు అవసరమైన డబ్బు కూడా లేదని అన్నారు. అన్నీ ఆలోచించి ఒక్క పిలుపునిచ్చాను, నా పిలుపు విని ఇప్పటి రాజధాని రైతులు  స్పందించారు, వారు నన్ను విశ్వసించారు, వారికి నేను ఒకటే చెప్పాను. సింగపూర్ తరహా నగరాన్ని నిర్మిస్తానని ఎంతో నమ్మకంగా చెప్పాను, వారు నమ్మి ప్రభుత్వానికి 33 వేల ఎకరాల విలువైన భూముల్ని ధారదత్తం చేశారని చంద్రబాబు అన్నారు. వెంటనే నేను కార్యాచరణలోకి దిగాను, రాజధాని నిర్మాణం కోసం బృహత్తర ప్రణాళికను రూపొందించాలని తొలుత సింగపూర్ ప్రభుత్వాన్ని అభ్యర్ధించానని వెల్లడించారు. వారు వెంటనే తమ మంత్రివర్గ సమావేశంలో చర్చించి తమ సంసిద్ధత వ్యక్తం చేశారు, కేవలం వారం రోజుల వ్యవధిలోనే వారు స్పందించి కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో మాలో కొత్త ఉత్సాహం వచ్చింది. చెప్పినట్టే వారు 6 మాసాల అత్యంత తక్కువ కాలంలో మా రాజధాని కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి ఇచ్చారని అన్నారు. ఆ తరువాత రాజధాని ప్రాంతంలో మౌలిక వసతుల నిర్మాణాన్ని చేపట్టాం, విశాలమైన రహదారులు, భూగర్భజల వ్యవస్థ, మురుగునీటి పారుదల వ్యవస్థ, వరద నియంత్రణ వ్యవస్థ తదితర ఏర్పాట్లన్నీ ఒక్కొక్కటీ పూర్తిచేస్తూ వస్తున్నాం. ప్రపంచంలోనే అత్యుత్తమ కన్సల్టెంట్లను నియమించుకుని మా రాజధాని ప్రణాళికలు, ఆకృతులు రూపొందించుకుంటున్నామని అన్నారు. అంతకుముందు హిందుస్థాన్ టైమ్స్ ఎడిటర్ ఆర్ సుకుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబును సమావేశంలో పరిచయం చేసారు.  ఆధునిక సాంకేతికతను పాలనలో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రిగా, సంస్కరణవాదిగా చంద్రబాబును అయనను సుకుమార్  అభివర్ణించారు.
Tags:Singaporean responded weekly: CM Chandrababu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *