సింగపూర్ తరహ చట్టాలు రావాలి – పవన్ కళ్యాణ్

Singapore's laws need to come - Pawan Kalyan

Date:14/04/2018
హైదరాబాద్ ముచ్చట్లు :
కథువా అత్యాచారం ఘనటపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  అసిఫా పై జరిగిన అత్యాచారం పై పవన్  నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద కార్యకర్తలతో నిరసనకు దిగారు. పవన్ మాట్లాడుతూ . ఢిల్లీలో అత్యాచార ఘటన జరిగిన తర్వాతే నిర్భయ చట్టం వచ్చిందని తెలిపారు. కళ్ల ముందు జరిగితే కానీ ఎంపీలు స్పందించరా అని అసహనం వ్యక్తం చేశారు. ఆడపిల్లల్ని వేధించేవారిని, అత్యాచారానికి ఒడిగట్టేవారిని బహిరంగంగా శిక్షించాలని… అప్పుడే అందర్లో భయం పుడుతుందని అన్నారు. సింగపూర్ తరహాలో శిక్షలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పశువులకు కూడా ప్రకృతి నియమం ఉంటుందని… మానవ మృగాలకు ఎలాంటి నియమాలు లేకుండా పోయాయని అన్నారు. అత్యాచారాల విషయంపై ప్రధాని సహా అన్ని రాష్ట్రాల సీఎం లు స్పందించాలి. సింగపూర్ తరహా లో బెత్తమ్ .పట్టుకునే విధంగా చట్టాలు రావాలని అన్నారు. తెలుగు రాష్ట్రా ప్రభుత్వాలు మహిళల పై బలమైన చట్టాలు తీసుకురావాలి. జనసేన పార్టీ మహిళలకు అండగా ఉంటుందని అయన అన్నారు. సినీనటి శ్రీ రెడ్డి కామెంట్స్ పై కుడా పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎవరికి అయినా ఏమి జరిగినా చట్టాలు ఉన్నాయి. ఎవరికి అన్యాయం జరిగినా కోర్ట్ కి వెళ్ళవచ్చు…కానీ టీవీ చర్చలలో కాకుండా చట్టం ప్రకారం వెళితే నా మద్దతు ఉంటుందని అన్నారు. షూటింగ్ సమయం లో చాలా సంఘటనలు జరిగేవి. నేను చాలా సందర్భాలలో వాటిని అడ్డుకున్నానని అన్నారు.
Tags: Singapore’s laws need to come – Pawan Kalyan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *