వెంకన్న సన్నిధిలో సింగర్స్

తిరుమల ముచ్చట్లు:


ఈ టీవీ పాడుతా తియ్యగాలో విజేతగా నిలిచిన సింగర్స్ తో కలిసి టీటీడీ పాలక మండలి సభ్యుడు పోకల అశోక్ కుమార్ శ్రీవారిని దర్శించుకున్నారు. అయన మాట్లాడుతూ సరస్వతి కటాక్షంతోనే ఈ చిన్నారులు ఇంత అద్భుతంగా పాడుతున్నారు. గత రెండు రోజులుగా  మహతి కళాక్షేత్రంలో తమ గానంతో తిరుపతి వాసులను మంత్ర ముగ్దులను చేశారు. అన్ని రంగాల వారిని ప్రోత్సహించేలా ప్రధాని మోడీ ఆ  ఆ రంగాల వారికి పదవులు ఇచ్చారు. శ్రావణి భార్గవి ఆడియోవిడియో నేను చూసాను. ఆమె అన్నమయ్య పాటను అపహాస్యం చెయ్యడాన్ని నేను ఖండిస్తున్నాను. ఆమె తప్పు చేసినట్టు ఒప్పుకొని ఆ పాటను డిలీట్ చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కళాకారుల మీద ఉంది. స్వామి వారి ప్రతిష్టకు భంగం కలిగేలా ఎవరు ప్రవర్తించ వద్దు అని నా విజ్ణప్తి. శ్రావణి భార్గవి కనుక వీడియో డిలీట్ చెయ్యకుండా ఉంటే ఆమె పై పాలక మండలి తప్పక చర్యలు తీసుకునేదని అన్నారు.

 

Tags: Singers in the presence of Venkanna

Leave A Reply

Your email address will not be published.