సాగర తీరాన జాతీయ గీతం ఆలాపన

విశాఖపట్నం ముచ్చట్లు:


జాతీయ గీతం ఆలాపన తో విశాఖ సాగర తీరం మురిసిపో యింది. అజాది కా అమృత్ మహో త్సవ్, హర్ షుర్ తిరంగ కార్యక్ర మంలో భాగంగా ఆగష్టు 2 న జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య,బళ్ళారి రాఘవ జయంతి ఉత్సవాలను విశాఖలో ఘనంగా నిర్వహించారు.ఆర్కే బీచ్ జాతీయ జెండాలను చేతపట్టి భారీగా చేపట్టిన ర్యాలీని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ప్రారంభించారు. ముందుగా జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ లక్ష్మీ షా, పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్, జిల్లా అధికారులు, నగర పౌరులు, విద్యార్ధులు పాల్గొ న్నారు.అనంతరం స్పోర్ట్స్ ఆక్వా కాంప్లెక్స్ దగ్గర నిర్వహించిన సభలో పింగళి వెంకయ్య బళ్ళారి రాఘవ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

 

Tags: Singing of the national anthem by the sea

Leave A Reply

Your email address will not be published.