ఒకే దేశం ఒకే రేషన్ కార్డు

Date:01/07/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు విధానాన్ని 2020 జూన్ 30 నుంచి అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీని కోసం రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒక ఏడాది గడువు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఒకే రేషన్‌కార్డు పథకం అమలు ద్వారా లబ్ధిదారులు దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా రేషన్ షాపుల ద్వారా నిత్యవసర వస్తువులను సబ్సిడీ ధరలకు కొనుగోలు చేయవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, జార్ఖండ్, త్రిపుర వంటి పది రాష్ర్టాల్లో రేషన్ షాపులను మార్చుకునే వెసులుబాటు ఉన్నట్లు కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు అనేది మోదీ 2.0 ప్రభుత్వం వంద రోజుల ఎజెండాలో భాగమని, 2020 జూన్ 30 నాటికి దేశవ్యాప్తంగా కచ్చితంగా అమలు చేస్తామని పాశ్వాన్ తెలిపారు. ఈ వ్యవస్థను వేగవంతం చేయాలని కోరుతూ అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలకు లేఖలు రాసినట్లు చెప్పారు.22 రాష్ర్టాల్లో పీఓఎస్ యంత్రాలు వంద శాతం అందుబాటులోకి వచ్చాయని, దీంతో వచ్చే ఏడాదికల్లా దీన్ని అమలు చేయడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన అన్నారు. పేద లబ్ధిదారుడు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లినా కూడా రేషన్ కోల్పోకుండా ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు పాశ్వాన్ తెలిపారు. ఒకే రేషన్ కార్డు విధానం ద్వారా నకిలీ రేషన్ కార్డుదారులను గుర్తించి తొలిగించవచ్చని అన్నారు. 2016 నవంబర్ నుంచి జాతీయ ఆహార భద్రతా చట్టంలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి నెలా 80 కోట్ల మందికి సబ్సిడీ కింద ఆహార ధాన్యాలు సరఫరా చేస్తున్నట్లు ఆయన వివరించారు.

 

యనమలతో టీడీపీ ఒరిగిందేమి లేదు

 

Tags: Single country single ration card

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *