Date:26/09/2020
పుల్కల్ ఎస్ఐ నాగలక్ష్మి
సంగారెడ్డి ముచ్చట్లు:
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సింగూరు ప్రాజెక్టును చూసేందుకు అనుమతి లేదని పుల్కల్ ఎస్ఐ నాగలక్ష్మి అన్నారు ఈ సందర్భంగా ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రాజెక్టులోరోజురోజుకు నీటి మట్టం పెరగడంతో జిల్లా ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుండి ప్రాజెక్టు చూసేందుకు భారీ ఎత్తున పర్యాటకులు రావడంతో వచ్చిన పర్యాటకులు ప్రాజెక్టును చూడడమే కాకుండా సెల్ఫీలు దిగడం ఇతరత్ర కార్యక్రమాలకు పాల్పడుతుండటంతో దీంతో వారికి ప్రాణాపాయం పొంచి ఉండడం వల్ల పై అధికారుల ఆదేశాల మేరకు ప్రాజెక్టు పై గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు వీటిని దృష్టిలో పెట్టుకొని పర్యాటకులు రూపాయలు చూసేందుకు రావద్దని ఆమె సూచించారు ఎవరైనా బలవంతానికి పాల్పడితే వారు ఎంతటి వారైనా వారిపైచట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు.
ఎమ్మెల్యే ను కలిసిన కమీషన్ మర్చెంట్స్ అసోసియేషన్ నాయకులు
Tags:Singur is not allowed to visit the project