సింహపురి ఎక్స్ ప్రెస్  పునః ప్రారంభం

Date:05/12/2020

నెల్లూరు  ముచ్చట్లు:

తొమ్మిది నెలల తరువాత గూడూరు రైల్వే జంక్షన్ నుండి గూడూరు – సికింద్రాబాద్ సింహపురి ఎక్స్ ప్రెస్ రైలు శుక్రవారం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు సికింద్రాబాద్ కు బయలు దేరింది . రైలు ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండిన సింహపురి ఎక్స్ప్రెస్ కరోనా వైరస్ ప్రభావం తో మార్చి 23వ తేదీ నిలుపుదల చేయడం జరిగింది . రైల్వే శాఖ అనుమతులతో శుక్రవారం పునః ప్రారంభమైంది . తత్కాల్ చార్జీలతో  రిజర్వేషన్ టికెట్లు సింహపూరి ఎక్స్ప్రెస్ లో ప్రయాణించే రైలు ప్రయాణికులకు జారీ చేస్తున్నారు . ఈ రైల్లో ప్రయాణించాల్సిన ప్రయాణికులు తప్పనిసరిగా టికెట్ రిజర్వేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది . సింహపురి ఎక్స్ప్రెస్ పున ప్రారంభం గురించి ప్రయాణికులకు ముందస్తు సమాచారం లేకపోవడంతో రైలు నామమాత్రం ప్రయాణికులతో గూడూరు రైల్వే జంక్షన్ నుండి బయలుదేరి వెళ్ళింది . సాధారణంగా  సింహపురి ఎక్స్ప్రెస్ రైలు బయలుదేరే సమయంలో ఆ ప్లాట్ఫామ్పై రైలులో ప్రయాణించే ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది . అయితే నేడు ప్రయాణికులు లేక ప్లాట్ ఫామ్ పై వెలవెల పోయింది .

పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: Sinhapuri Express resumes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *