సోషల్ మీడియాలో సైరా …

Sira in social media ...

Sira in social media ...

Date:19/03/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. సుమారు రూ. 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న సైరాలో సౌత్‌ నటులతోపాటు బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే  ఈ చిత్రానికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో లీక్‌ కావటంతో చిత్ర యూనిట్‌ కంగుతింది. ఓ ఇంట్లో ప్రధాన తారాగణం షూటింగ్‌లో పాల్గొన్న ఫోటో అది. చిరుతోపాటు హీరోయిన్‌ నయనతార.. మరికొందరు పాత్రధారులు అందులో ఉన్నారు. చేతిలో చంటిబిడ్డను ఎత్తుకున్న నయన్‌.. చిరు కుటుంబ సభ్యులతో సీరియస్‌గా మాట్లాడుతుండగా.. వెనకాల చిరు (నరసింహారెడ్డి) అనుచరులు ఉన్న ఫోటో అది. చిత్ర యూనిట్‌ సభ్యుల్లో ఎవరో రహస్యంగా ఆ ఫోటోను తీసి ఇంటర్నెట్‌లో పెట్టినట్లు స్ఫష్టమౌతోంది. అయితే ఫోటో లీక్‌ అయిన విషయాన్ని తెలుసుకున్న చిత్ర యూనిట్‌ అప్రమత్తమై వెంటనే దానిని తొలగించింది. ఈ వ్యవహారంపై చిరుతోపాటు నిర్మాత రామ్‌ చరణ్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక మీదట జాగ్రత్తగా ఉండాలని చిత్ర యూనిట్‌కు వాళ్లు వార్నింగ్‌ ఇచ్చారంట.
Tags: Sira in social media …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *